JGL: మేడిపల్లి మండలం పోరుమల్ల గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పాల్గొని గ్రామ ప్రజల సమస్యలు, అభివృద్ధి అవసరాలు, సంక్షేమ పథకాల అమలుపై నేరుగా అభిప్రాయాలు స్వీకరించారు. తాగునీరు, రహదారులు, పారిశుధ్యం, విద్య, వైద్యం, అంశాలపై చర్చించారు.