RR: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శంకర్పల్లి మున్సిపల్ కార్యాలయంలో ఛైర్మన్ సాత ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో వార్డు సభ జరిగింది. మున్సిపల్ వార్డులలో పరిశుభ్రత, రాబోయే వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పట్టణ అభివృద్ధిపై ఈ సభలో చర్చించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ యోగేష్, స్థానిక కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, అధికారులు పాల్గొని పలు సూచనలు చేశారు.