AP: ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను కూటమి ప్రభుత్వం పూర్తిగా తుంగలో తొక్కి.. గత రెండేళ్లుగా నియంతృత్వ పాలన సాగిస్తోందని YCP రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకరరావు ఆరోపించారు. రూ.3.50 లక్షల కోట్ల అప్పులతో APని అప్పులకుప్పగా మార్చిందన్నారు. DSCలో అక్రమాలు, ప్రభుత్వ భూముల దోపిడీ, ఉద్యోగులకు వేధింపులు, మహిళలపై అఘాయిత్యాలతో APలో వ్యవస్థలను కూటమి నేతలు గాడి తప్పించారని విమర్శించారు.