TPT: సూళ్లూరుపేట MLA నెలవల విజయశ్రీ రేపు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటే, సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమంలో ఆమె పాల్గొంటారు. అనంతరం ట్రాన్స్జెండర్ల కోసం ప్రత్యేకంగా నిర్వహించే ప్రజా దర్బార్లో పాల్గొని వారి సమస్యలను స్వీకరిస్తారు. సాయంత్రం నూకలపాలెంలో జరిగే అమ్మవారి జాతర మహోత్సవాల్లో ఆమె పాల్గొంటారని తెలిపారు.