TG: ఖరీఫ్ పంట కాలంపై మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సమీక్ష నిర్వహించారు. ఎల్నినో పరిస్థితులు, పంట వ్యర్థాల కాల్చివేతలు, వ్యవసాయశాఖ ఆస్తుల పరిరక్షణపై చర్చించారు. ఎరువుల నిర్వహణ వ్యవస్థ వంటి అంశాలపై విస్తృతంగా సమీక్షించారు. కోహెడ పండ్ల మార్కెట్ శంకుస్థాపన ఏర్పాట్లపై ఆరా తీశారు. వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు రైతులను సన్నద్ధం చేయాలన్నారు.