ELR: నూజివీడు క్రికెట్ స్టేడియం గ్రౌండ్స్‌లో ఉచిత సమ్మర్ క్యాంపు క్రికెట్ కోచింగ్ ముగింపు వేడుకలు గురువారం రాత్రి నిర్వహించారు. క్రికెట్ ప్లేయర్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పగడాల సత్యనారాయణ, మాజీ కౌన్సిలర్ నౌడు నాగ మల్లేశ్వరరావులు మాట్లాడుతూ.. చిన్నారులు క్రికెట్ క్రీడలో శిక్షణ పొందడం, అద్భుతంగా ఆడడం ఎంతో ఆనందం కలిగిస్తుంది అన్నారు.