అస్సాంలోని గువాహటిలో ఎండ తీవ్రతకు ఓ పెంపుడు కుక్కను గంటల తరబడి కారులోనే వదిలేసిన ఘటన కలకలం రేపింది. తీవ్రమైన ఉక్కపోత, డీహైడ్రేషన్‌తో విలవిలలాడుతున్న ఆ మూగజీవిని గమనించిన స్థానికులు, రెస్క్యూ సిబ్బంది కారు అద్దాలు పగులగొట్టి సకాలంలో కాపాడారు. యజమాని నిర్లక్ష్యంపై నెటిజన్లు, జంతు ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.