SRD: ఖేడ్ మండలం హంగీర్గ గ్రామంలో గురువారం ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. ఈ మేరకు తహసీల్దార్ రాజు పటేల్, MRI మాధవరెడ్డి, ఏఈఓ హరీష్ వానకాలం పంటలపై రైతులకు కీలక సూచనలు చేశారు. వచ్చే కరువును దృష్టిలో ఉంచి ఖరీఫ్‌లో వరి సాగు తగ్గించాలన్నారు. అదేవిధంగా జనగణన రివిజన్, శానిటేషన్, సైడ్ డ్రైన్స్ పూడిక, పరిసరాల పరిశుభ్రత, తాగునీటిపై సమీక్షించారు.