ADB: ఏఐటీయూసీ యూనియన్ నుంచి కుంటాల రాములును సస్పెండ్ చేస్తున్నట్లు AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి దేవేందర్ తెలియజేశారు. ఈ మేరకు గురువారం జిల్లా కేంద్రంలో దేవేందర్ సమావేశమై వివరాలను వెల్లడించారు. ఏఐటీయూసీ యూనియన్‌కు వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నందుకు గానూ జిల్లా కార్యవర్గం ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఆయన్ను సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.