NGKL: పెద్దకొత్తపల్లి మండలం నక్కలపల్లి గేటు సమీపంలో NH167-కే లో గురువారం ఘోర ప్రమాదం జరిగింది. స్థానికులు వివరాలు.. వేగంగా వచ్చిన ఓ కారు రహదారిపై ఉన్న పశువులను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రణవి (7) అనే బాలికతో పాటు రెండు కాడెద్దులు అక్కడికక్కడే మృతి చెందాయి. కారులో ఉన్న మరో ముగ్గురికి గాయాలయ్యాయి. గంగపురి చిన్నయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.