ASF: బెజ్జూర్ మండలంలోని నాలుగు క్లస్టర్లలో ముగ్గురు AEOలు ఇటీవల బదిలీ అయ్యారు. ఖరీఫ్ సాగు సీజన్ ప్రారంభమైన తరుణంలో అధికారులు మారడంతో విత్తనాలు, ఎరువులు పొందేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే మండలంలో సరిపడా AEOలను నియమించాలని కోరుతున్నారు.