W.G: పెనుగొండ మండలం వడలిలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలు మంగళవారం నిరసన తెలిపారు. సంఘం నేత షేక్ పాదుషా మాట్లాడుతూ.. కేంద్రం తీసుకొచ్చిన విబిజీ రాంజీ పథకాన్ని రద్దు చేసి, యథావిధిగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని కోరారు. అలాగే ఫేస్ యాప్ నిబంధనను తొలగించి, పని వేళల్లో వెసులుబాటు కల్పించాలని డిమాండ్ చేశారు.