అన్నమయ్య: లక్కిరెడ్డిపల్లిలో ఎన్హెచ్-440 రహదారి విస్తరణలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు పూర్తి స్థాయిలో పరిహారం చెల్లించిన తర్వాతే రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని సీపీఐ రాయచోటి నియోజకవర్గ కార్యదర్శి సిద్దిగాళ్ల శ్రీనివాసులు డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలను పరామర్శించిన ఆయన, ముందస్తు సమాచారం లేకుండా ఇళ్ల తొలగింపు అన్యాయమని విమర్శించారు.