జలుబు, దగ్గు వంటి సమస్యలకు అల్లం టీ ఒక మంచి విరుగుడుగా పనిచేస్తుంది. అల్లంలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు గొంతు నొప్పిని తగ్గిస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా అల్లం బాగా పనిచేస్తుంది. రోజుకు ఒకసారి అల్లం టీ తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి ఇన్ఫెక్షన్లు దరిచేరవు.