GNTR: జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మను జిల్లా సర్వే అసిస్టెంట్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో కొనసాగుతున్న సర్వే, రీ-సర్వే పనుల పురోగతిపై చర్చించారు. పనులను ప్రణాళికాబద్ధంగా నిర్వహించి నిర్దేశిత గడువులోగా విజయవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.