AP: రష్యా పర్యటనలో మంత్రి లోకేష్ ఆ దేశానికి చెందిన ఉక్కు సంస్థ ‘నోవోస్టల్–ఎం’ చైర్మన్ ఇవాన్ డెమ్చెంకోతో భేటీ అయ్యారు. APలోని ‘శ్రీసిటీ’లో రైల్వే ట్రాక్ రోలింగ్ మిల్లును ఏర్పాటు చేయాలని కోరారు. తర్వాత గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ ‘సిస్టమా’ ప్రెసిడెంట్ సిట్దేకోవ్తో సమావేశమై APలోని అంతర్గత జలరవాణా మార్గాలలో ‘ఎలక్ట్రిక్ రివర్ మెట్రో’ పైలట్ ప్రాజెక్టులను ప్రారంభించాలని కోరారు.