AP: కేంద్ర, రాష్ట్ర పాలనా విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా NDA భేటీలో కార్యాచరణ రూపొందించామని TDP రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. సంక్షేమ కార్యక్రమాలపై ఈనెల 9న తిరుపతిలో, పరిపాలనపై ఈనెల 12న అమరావతిలో, అభివృద్ధిపై ఈనెల 15న విశాఖలో భారీ సభలు నిర్వహిస్తామని ప్రకటించారు. జిల్లాల అభివృద్ధిపైనా కార్యక్రమాలు చేపడతామని, పూర్తి షెడ్యూల్ త్వరలో ప్రకటిస్తామన్నారు.