ప్రకాశం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన మర్రిపూడి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ నూతన ఛైర్మన్గా మర్రిపూడికి చెందిన గొంటు హనుమారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనతో పాటు మండలానికి చెందిన మరో ఎనిమిది మందిని డైరెక్టర్లుగా నియమించారు. నూతన పాలకమండలి సభ్యులంతా ఈ నెల 8న ఆలయ ప్రాంగణంలో అధికారికంగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు చెప్పారు.