KRNL: కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్,వంటగ్యాస్ ధరలను వెంటనే ఉపసంహరించుకోకపోతే పోరాటాలను మరింత ఉద్ధృతం చేస్తామని సీపీఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయి హెచ్చరించారు. ఇవాళ కర్నూలులో పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ వామపక్ష పార్టీలు జిల్లా వ్యాప్తంగా జూన్ 1 నుంచి 9 వరకు చేపట్టిన ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.