BPT: జిల్లాలో పలువురు రెవెన్యూ అధికారులను బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ డా. వి. వినోద్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ఆదేశాల మేరకు ఈ పోస్టింగులు ఇచ్చారు. ఇందులో భాగంగా ప్రస్తుతం వేమూరు తాహసీల్దార్ కార్యాలయంలో డెప్యూటీ తాహసీల్దార్గా పనిచేస్తున్న డి. రవీంద్ర కుమార్ను కర్లపాలెం తాహసీల్దార్గా నియమించారు.