ADB: జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియను ఎలాంటి లోపాలు లేకుండా, అత్యంత పారదర్శకంగా పూర్తి చేయాలని కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. గురువారం ఢిల్లీ నుంచి నిర్వహించిన కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ట్రైనింగ్ ఆన్ ఎస్ఐఆర్ ప్రత్యేక శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. SIR ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయిలో చేపట్టవలసిన వివిధ కీలక దశలపై అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు.