నందు, అవికా గోర్, రవితేజ మహాదాస్యం ప్రధాన పాత్రల్లో ప్రణవ స్వరూప్ దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ థ్రిల్లర్ ‘అగ్లీ స్టోరీ’. మే 22న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం, థియేటర్ రన్ ముగించుకుని ఇప్పుడు డిజిటల్ ప్రియులను అలరించడానికి సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ‘ఆహా’లో జూన్ 5 నుంచి ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.