TG: చదువుకు వయసుతో సంబంధం లేదని మాజీ మావోయిస్టు కీలక నేత తిపిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ మరోసారి నిరూపించారు. ఇవాళ విడుదలైన లా సెట్ ఫలితాల్లో ఐదేళ్ల న్యాయ విద్య కోర్సు ప్రవేశ పరీక్షలో 349వ ర్యాంకు సాధించారు. ఇటీవల జనజీవన స్రవంతిలో కలిసిన దేవ్ జీ, సమాజ సేవకు కొత్త దారిని ఎంచుకున్నారు. న్యాయ విద్యను అభ్యసించి పేదలకు ఉచిత న్యాయ సహాయం అందించాలనే లక్ష్యంతో ఆయన చదువు బాట పట్టారు.