HNK: మహిళ డైరీ అభివృద్ధి పనులను మరింత వేగవంతంగా పూర్తి చేసేలా కలెక్టర్ సంబంధిత అధికారులతో సమన్వయం చేస్తూ ముందుకు సాగాలని ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా పరకాల మండల కేంద్రంలో గురువారం డైరీ అభివృద్ధిపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్లు చాహత్ బాజ్ పాయి, డాక్టర్ సత్య శారదా దేవి పాల్గొన్నారు.