AP: ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన ప్రస్తుత తరుణంలో మంత్రులకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు చేశారు. పంట మార్పిడిపై రైతులకు అవగాహన కల్పించాలని.. ఏటా ఒకే పంటను పండించడం వల్ల రైతులకు, భూమికి కలిగే నష్టాన్ని వారికి వివరించాలని చెప్పారు. APలో పప్పుధాన్యాల ఉత్పత్తి పెరగడం శుభపరిణామమని, సముద్ర ఆహార ఉత్పత్తిలోనూ గణనీయ ప్రగతి సాధించాలని అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేసి ముందుకుసాగాలన్నారు.