GNTR: జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ను తుళ్లూరు ట్రాఫిక్ సీఐ-2గా బాధ్యతలు స్వీకరించిన కె. క్రాంతి కిరణ్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఎస్పీకి పూల మొక్కను అందజేశారు. గతంలో తుళ్లూరు, మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లలో ఎస్ఐగా విధులు నిర్వహించిన క్రాంతి కిరణ్ ఇటీవల పదోన్నతి పొంది తుళ్లూరు సీఐ-2గా రిపోర్ట్ చేశారు.