ప్రకాశం: ఒంగోలు మండలం చెరుకుపాలెం చెరువులో ఈతకు వెళ్లి గల్లంతైన నలుగురు చిన్నారుల మృతదేహాలను వెలికి తీశారు. గురువారం మధ్యాహ్నం సమయంలో ఈతకు వెళ్లిన సుశాంత్, చిన్ను, దినేష్, అభిరామ్ అనే చిన్నారులు చెరువులో గల్లంతయ్యారు. గట్టుపై బట్టలు ఉండడం గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. చిన్నారుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.