NDL: డోన్ పట్టణంలో ఇవాళ జిల్లా జాయింట్ కలెక్టర్ గనోర్ సూరజ్ ధనంజయ్ డోన్ ఆర్డీవో కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయానికి వచ్చిన ప్రజలు, రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సిబ్బందితో కార్యాలయ పనితీరు, పెండింగ్ దరఖాస్తులపై వివరాలుసేకరించారు. ప్రజాసమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. జేసీ వెంట ఆర్డీవో నరసింహులు ఉన్నారు.