మాధురి దీక్షిత్, త్రిప్తి దిమ్రి ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్ డార్క్ కామెడీ చిత్రం ‘మా బెహన్’ ఈరోజు నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలోని ముగ్గురు మహిళల ఇంట్లో పక్కింటి వ్యక్తి శవమై కనిపిస్తాడు. పోలీసులకు దొరకకుండా ఆ శవాన్ని వారు ఎలా దాచారు, ఎలాంటి విచిత్ర పరిస్థితులు ఎదుర్కొన్నారనే ఆసక్తికర కథాంశంతో ఈ సినిమా రూపొందింది.