కృష్ణా: పెదపారుపూడి మండలంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీ పత్రాలు ప్రదర్శిస్తూ, వైసీపీ శ్రేణులు గురువారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని, ప్రజలను మోసం చేసిందని వైసీపీ శ్రేణులు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.