పాకిస్తాన్తో జరుగుతున్న కీలకమైన మూడో వన్డేలో ఆస్ట్రేలియా 157 పరుగులకే కుప్పకూలింది. పాక్ బౌలర్లు నిప్పులు చెరగడంతో ఆసీస్ బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. ఇంగ్లిస్ (65) మినహా మిగిలిన బ్యాటర్లంతా ఘోరంగా విఫలయ్యారు. అఫ్రిది 3 వికెట్లు తీయగా.. అబ్రార్ అహ్మద్, షాదబ్ తలో 2 వికెట్లు పడగొట్టారు. పాక్ ఈ మ్యాచ్లో గెలిస్తే 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంటుంది.