AP: రష్యాలో జరుగుతున్న SPIEF బిజినెస్ ఫోరం సదస్సులో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. భారత్, రష్యాల మధ్య ఉన్న సుదీర్ఘ సాంకేతిక, ఆర్థిక అనుబంధాన్ని గుర్తుచేశారు. 2030 నాటికి $100 బిలియన్ల ద్వైపాక్షిక వాణిజ్య లక్ష్యాన్ని చేరుకోవడంలో AP కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ విధానంతో APని $2.5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే తమ ధ్యేయమని ప్రకటించారు.