AP: కిడ్నీ రోగులకు ఉపశమనం కలిగించేలా రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. చికిత్స కోసం సమీప బంధువుల నుంచి కిడ్నీలు స్వీకరించేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇప్పటి వరకు కుటుంబసభ్యుల కిడ్నీలను మాత్రమే తీసుకునే అవకాశం ఉండేది. ఇక నుంచి తాత, అమ్మమ్మ, నాన్నమ్మ కూడా కిడ్నీలు ఇవ్వవచ్చని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.