UPలో నిన్న ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పరీక్ష జరిగింది. అయితే, ఈ పరీక్షలో పాస్ అవ్వడం కోసం ఒక వ్యక్తి రూ.1.5 లక్షలకు మరొకరితో ఒప్పందం చేసుకున్నాడు. దీంతో అతడి స్థానంలో పరీక్ష రాయడానికి ఓ నకిలీ అభ్యర్థి ప్రయత్నించాడు. పరీక్ష హాల్లో అతడిపై అనుమానం వచ్చిన సిబ్బంది… అతడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.