ASF: కాగజ్నగర్ మండలంలో గురువారం కలెక్టర్ హరిత విస్తృతంగా పర్యటించారు. పర్యటనలో భాగంగా గన్నారం మాండవ, ఆరెగూడ, అనుకొడ గ్రామాలలో గల చెరువులను సందర్శించి పరిశీలించారు. నజ్రుల్ నగర్ గ్రామ పరిధిలో మట్టిని తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను తనిఖీ చేసి, అనుమతులు లేకపోవడంతో ఆ ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్కు తరలించాలని అధికారులను ఆదేశించారు.