KRNL: కోడుమూరులో “ఆపరేషన్ దండయాన” పోస్టర్లను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆవిష్కరించారు. మహిళలపై జరుగుతున్న నేరాల నివారణ, భద్రతపై అవగాహన కల్పించేందుకు గురువారం కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మిగనూరు రోడ్డులోని శ్రీవాసవి కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో మహిళల భద్రత, చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.