TG: ఇవాళ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు కిటకిటలాడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి భూముల విలువల సవరణ అమల్లోకి రానుంది. ఈ విలువల పెంపు దృష్ట్యా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద రద్దీ పెరిగింది. సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసులు ఇవాళ రాత్రి 7.30 గంటల వరకు పనిచేయనున్న నేపథ్యంలో కార్యాలయాల వద్ద జనం బారులు తీరారు.