AP: CM చంద్రబాబు అధ్యక్షతన.. సీఎం క్యాంప్ ఆఫీస్ వేదికగా కూటమి నేతల సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీలో డిప్యూటీ CM, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, BJP రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, TDP AP అధ్యక్షుడు శ్రీనివాసరావు పాల్గొన్నారు. రాష్ట్రంలో తాజా పరిణామాలు, SIR అమలు, రాజ్యసభ ఎన్నికలు, అభ్యర్థుల ఎంపిక, కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనా విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై చర్చిస్తున్నారు.