E.G: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న “పశు సంపదతో గ్రామ సంపద పెంపు” కార్యక్రమాన్ని పశుపోషకులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. గురువారం కలెక్టరేట్లో “విలేజ్ హెర్డ్ ఫెర్టిలిటీ రిజిస్టర్” పుస్తకాన్ని ఆమె ఆవిష్కరించారు. పశుసంపద అభివృద్ధి ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే తమ లక్ష్యం అన్నారు.