GNTR: గుంటూరు 26వ డివిజన్ దాసరిపాలెంలో నూతనంగా నిర్మించిన బీటీ రోడ్డును ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు గురువారం ప్రారంభించారు. కొత్తూరు నుంచి బైక్ ర్యాలీగా వచ్చిన ఆయన.. గత వైసీపీ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు.