MBNR: ఈ నెల 8న అడ్డాకులలో నిర్వహించనున్న హిందూ సమ్మేళనం విజయవంతం కావాలని కోరుతూ రాచాల గ్రామంలో కరపత్రాల పంపిణీ నిర్వహించారు. అడ్డకల్ హిందూ సమ్మేళన కమిటీ సభ్యులు గ్రామ దేవాలయ కమిటీ ప్రతినిధులు, ప్రజలను కలిసి కార్యక్రమానికి ఆహ్వానించారు. సమ్మేళనంలో హిందూ ధర్మ పరిరక్షణ, సామాజిక ఐక్యత, సాంస్కృతిక విలువలపై చర్చలు జరుగుతాయని తెలిపారు.