TG: అమీర్పేట అగ్నిప్రమాద స్థలాన్ని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదా? అని ప్రశ్నించారు. గతంలో జరిగిన ప్రమాదలపై కనీసం సమీక్ష కూడా చేయలేదని ఆరోపించారు. బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతంకాకుండా చూడాలని కోరారు.