ATP: జిల్లా పోలీస్ శాఖలో సరికొత్త సాంకేతిక సంస్కరణలకు శ్రీకారం చుడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా రూపొందించిన ‘AI డ్యూటీ రోస్టర్’ మొబైల్ అప్లికేషన్న ఎస్పీ జగదీష్ ఆవిష్కరించారు. సిబ్బంది సీనియారిటీ, నైపుణ్యాల ఆధారంగా ఏఐ స్వయంచాలకంగా, పారదర్శకంగా విధులను కేటాయిస్తుందని తెలిపారు. విధుల్లో జవాబుదారీతనం పెంచేందుకు ఈ యాప్ దోహదపడుతుందన్నారు.