ASF: జిల్లా మహిళా సమాఖ్య భవన నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ హరిత పరిశీలించారు. డిస్ట్రిక్ట్ పంచాయతీ రాజ్ ఇంజనీర్ (DPRE)తో కలిసి ఆమె పనుల పురోగతిని సమీక్షించారు. భవన నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని, పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.