VZM: వేపాడ మండలం కొండగంగుపూడిలో పిడుగు పడి గురువారం 9 మేకలు మృతి చెందాయి. రామస్వామి పేట గ్రామానికి చెందిన పత్రి శ్రీను గురువారం ఉదయం మేకలను కొండగంగుపూడి సమీపంలో మేతకు తీసుకువెళ్లాడు. ఈ క్రమంలో వర్షానికి పడిన పిడుగుపాటుకు 9 మేకలు మృతి చెందాయి. తనను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు శ్రీను రోధిస్తూ అధికారులను కోరారు.