MDK: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచేందుకు ‘బడి బాట’ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. తక్కువ నమోదు ఉన్న స్కూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, కనీస విద్యా సామర్థ్యాలు పెంచాలని, ఏఐ, డిజిటల్ తరగతులు నిర్వహించాలని అధికారులను కోరారు.