NTR: పర్యావరణ పరిరక్షణపై చిన్నప్పటి నుంచే అవగాహన కల్పిస్తే విద్యార్థులు బాధ్యతాయుత పౌరులుగా ఎదుగుతారని కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. ఈ నెల 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విజయవాడ సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్లో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. పర్యావరణ పరిరక్షణను కేవలం ఒక కార్యక్రమంగా కాకుండా జీవన విధానంగా మార్చుకోవాలన్నారు.