TG: రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షం మొదలైంది. HYDలోని బంజరాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట ప్రాంతాల్లో వర్షం పడుతోంది. అయితే ఈ ఏడాది రుతపవనాల రాక ఆలస్యం అవుతుందనుకున్నప్పటికీ ముందుగానే వచ్చాయి. దీంతో తొలకరి జల్లుల పలకరింపు ప్రారంభమైందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పట్టణ, నగర ప్రజలు ఎండ వేడి నుంచి ఉపశమనం కలిగిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.