AP: పోలవరం జిల్లాలో పెద్దపులి దాడి కొనసాగుతోంది. నిన్న గంగంపాలెం పరిసరాల్లో పులి దాడిలో 12 ఆవు దూడలు, ఒక గేదె మరణించగా.. ఇవాళ మరో రెండు ఆవుదూడలను పులి చంపి చంపాక కొండపైకి లాక్కొని వెళ్లింది. డ్రోన్ కెమెరా ద్వారా ఈ దాడిని అటవీశాఖ అధికారులు గుర్తించారు. పులిని పట్టుకునేందుకు 200 మంది సిబ్బందితో ప్రత్యేక రెస్క్యూ ఆపరేషన్ను కొనసాగిస్తున్నారు.