TG: మాజీమంత్రి కేటీఆర్‌పై ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం పోయినా కేటీఆర్‌కు గర్వం తగ్గలేదని విమర్శించారు. సభ్యత, సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఆయనకు నాయకత్వ లక్షణాలు లేవని ఎద్దేవా చేశారు. అందుకే బీఆర్ఎస్ను సొంత చెల్లి వీడిందని పేర్కొన్నారు. ఇప్పటికైనా కేటీఆర్ భాష మార్చుకోవాలని హితవు పలికారు.